అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి: బొట్ల యాదయ్య

యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూర్‌లో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొట్ల యాదయ్య మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే సునీతా మహేందర్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన జీవోలతో సహా సైదాపురంలో కాంగ్రెస్ నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అధికార పార్టీ నేతలు స్వార్థ ప్రయోజనాల కోసం ఇసుక, మట్టి దందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.


