హైదరాబాద్ నడిబొడ్డున 20 అడుగుల భారీ కొండచిలువ!
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని KBR నేషనల్ పార్క్‌లో శనివారం ఉదయం వాకర్స్‌కు ఒక భారీ కొండచిలువ (Python) కనిపించి ఆశ్చర్యపరిచింది. సుమారు 20 అడుగుల పొడవున్న ఈ భారీ సర్పం.. పార్క్‌లోని వాకింగ్ ట్రాక్‌ను నెమ్మదిగా దాటుకుంటూ వెళ్తుండటంతో అక్కడున్న వారు కాసేపు భయాందోళనకు, మరికొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ భారీ కొండచిలువ రోడ్డు దాటుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న ఈ అర్బన్ ఫారెస్ట్‌లో వన్యప్రాణుల జీవవైవిధ్యానికి ఈ ఘటనే నిదర్శనమని అధికారులు చెబుతున్నారు.



