← Back to news

విద్యుత్‌ కనెక్షన్ల పేరుతో అధిక వసూళ్లు?

By A.Ajay· 3h ago
విద్యుత్‌ కనెక్షన్ల పేరుతో అధిక వసూళ్లు?

TG: కొత్త విద్యుత్‌ కనెక్షన్లు, లైన్‌ మార్పులు, ఇతర పనుల కోసం ప్రజలు అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. నోటరీ పత్రాలతో విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.. విద్యుత్‌ కనెక్షన్‌ కోసం నిబంధనల ప్రకారం ఎంత చెల్లించాలి, ఇతర పనులకు ఎంత ఖర్చవుతుంది అనే విషయాలపై స్పష్టత అవసరమవుతోంది. ఈ వ్యవహారంపై విద్యుత్‌ శాఖ అధికారులు పరిశీలించి, అక్రమ వసూళ్లు జరిగితే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

More in TG