టీచర్ రాక.. చిన్నారులు చేపల వేట

TG: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని రింగైట్ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు విధులకు హాజరుకాకపోవడంతో బడికి తాళం పడింది. ఉదయాన్నే బడికి వెళ్లి చదువుకోవాల్సిన ఆ గిరిజన విద్యార్థులు స్కూల్ క్లోజ్ చేసి ఉండడంతో నిరాశగా వెనుదిరిగారు. పుస్తకాలు చేతబట్టాల్సిన ఆ పసి చేతులు సమీపంలోని వాగుల్లో చేపల వేటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరుపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



