Special Bus.. 30 మంది ఉంటే చాలు

TG: దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం TGSRTC ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ప్రయాణిస్తే.. వారు కోరిన ప్రాంతానికే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. బస్సుల వివరాలకోసం జూబ్లీ బస్ స్టేషన్ జోనల్ కమ్యూనికేషన్ నెంబరు 9959226160 కి కాల్ చేయాలని అధికారులు సూచించారు.

