పంట మాటున గంజాయి సాగు

నెల్లూరు జిల్లా దుత్తలూరులో అక్రమ గంజాయి సాగును పోలీసులు గుర్తించారు. గత రాత్రి పట్టుబడిన సాగును జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల పరిశీలించారు. మొక్కజొన్న పంట మధ్య రెండు ఎకరాల్లో డ్రోన్ సాయంతో గంజాయి సాగును గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 1,731 మొక్కలు ఉండగా, ఒక్కో మొక్క మూడు నుంచి ఆరు అడుగుల ఎత్తు పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు ఉప్పలపాటి సుబ్బారెడ్డితో పాటు ఆరుగురిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.



