← Back to news

మెట్పల్లిలో మట్టి వినాయకుల పంపిణీ..!

By Jagadish· 1d ago
మెట్పల్లిలో మట్టి వినాయకుల పంపిణీ..!

జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం చైతన్య నగర్లో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ జరిగింది. ఆర్యవైశ్యవాడ కట్టు సంఘం అధ్యక్షుడు పుల్లూరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాలనీవాసులకు మట్టి గణనాథులను అందజేశారు. పూజకు కావాల్సిన దోసకాయ, పొట్లకాయ, మారేడుకాయ, ఇతర కాయలు కూడా ఇచ్చారు. ప్లాస్టిక్ వినాయకులను వద్దని, పర్యావరణాన్ని కాపాడుదాం అని కాలనీవాసులు ప్రతిజ్ఞ చేశారు. కోశాధికారి నరేంద్రుల రవికుమార్, మహిళా సంఘం అధ్యక్షురాలు పుల్లూరి మధుమిత, పుల్లూరి రాములు తదితరులు పాల్గొన్నారు.

More in Politics