నేపాల్ లో జెన్ జీ ఆగ్రహావేశాలు !

నేపాల్‌లో యువత సపోర్ట్ తో అధికా రం లోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అదే 'జెన్-జీ' ఆగ్రహాన్ని ఫేస్ చేస్తోంది.అక్కడ జరుగుతున్న తీవ్ర నిరసనలు, ఆత్మహత్యా యత్నాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. వ్యవస్థ మారుతుందని ఆశించిన యువతకు రోజులు గడుస్తున్నా నిరాశే ఎదురవడంతో, నిరుద్యోగం, అవినీతిపై వారు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారు. తాము నమ్మిన యువ నాయకులే తమను మోసం చేశారనే అసంతృప్తి వారిలో తీవ్రంగా ఉంది. ఈ పరిణామాలు నేపాల్ రాజకీయాల్లో పెద్ద సంక్షోభానికి దారితీస్తున్నాయి.

