పాలమూరు ప్రాజెక్టులో 2 పంపులు స్టార్ట్!
నాగర్కర్నూల్ జిల్లాలోని నార్లాపూర్ పంప్హౌస్లో రెండో పంపును మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. దీంతో రెండు బాహుబలి మోటార్ల ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసే ప్రక్రియ మొదలైంది. శ్రీశైలంలో నీటిమట్టం తగ్గుతున్న నేపథ్యంలో నీటిని ఎత్తిపోసి నిల్వ చేసేందుకు ఈ పంపులను ప్రారంభించారు. దక్షిణ తెలంగాణకు సాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఇది కీలక అడుగు.



