అమ్మవారి కాలనీలో వరద.. డ్రైనేజీ కాలువలేవి?
రాజాం మున్సిపాలిటీ పరిధిలోని అమ్మవారి కాలనీలో డ్రైనేజీ కాలువలు లేవు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఎత్తు ప్రదేశాల నుంచి వరద నీరు వీధిలోకి చేరుతోంది. స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా మున్సిపాలిటీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు లేకపోవడంతో వర్షాలు పడినప్పుడల్లా నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు.


