చదువుకు వయసు లేదు.. అక్షరాస్యత పరీక్షలు

సిద్దిపేట జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో 'ఉల్లాస్' కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వయోజన విద్యా పరీక్షలు నిర్వహించారు. గ్రామంలోని నిరక్షరాస్యులు, వృద్ధులకు లెక్కలు చేయడం, బొమ్మలు-వస్తువులను గుర్తించడం, ఖాళీలను పూరించడం వంటి వాటిపై శిక్షణ ఇచ్చి, సర్పంచ్ కవిత సమక్షంలో పరీక్షలు పెట్టారు. చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని, అక్షరాస్యత ద్వారా ప్రతీ ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు.




