← Back to news

ఎంపీ నిధులతో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ ఏర్పాటు

By DK· 2d ago
ఎంపీ నిధులతో ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ ఏర్పాటు

AP: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం క్రిష్ణంశెట్టిపల్లెలో ఎంపీ నిధుల ద్వారా రూ.12 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు శుద్ధమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

More in Local