← Back to news

బీర్ కంపెనీకి అనుమతులు ఇవ్వొద్దు: అఖిలపక్ష నేతలు

By Bejjanki· 1d ago· Bejjanki, Bejjanki, Siddipet
బీర్ కంపెనీకి అనుమతులు ఇవ్వొద్దు: అఖిలపక్ష నేతలు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో కొత్త బీర్ కంపెనీ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వొద్దని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గుగ్గిళ్లపోతారం శివార్లలోని ఇథనాల్ పరిశ్రమల నుంచి వెలువడుతున్న దుర్వాసనతో బెజ్జంకి, కోహెడ మండలాలలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇథనాల్ పరిశ్రమలపై సమగ్ర విచారణ జరిపి నివేదికను వెల్లడించాలని PCB అధికారులను డిమాండ్ చేశారు. బీర్ కంపెనీ ఏర్పాటుకు అనుమతులు నిలిపివేయాలన్నారు.

More in Local