← Back to news

ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి దుర్వాసన

By Bejjanki· 1d ago· Bejjanki, Bejjanki, Siddipet
ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి దుర్వాసన

సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి వస్తున్న దుర్వాసనపై డబుల్ బెడ్‌రూమ్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రింబవళ్లు వాసన భరించలేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. భోజనం చేసే సమయంలో వాంతులు వస్తున్నాయని, చర్మంపై దురద వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి దుర్వాసన

More in Local