H-1B వీసాదారులకు Trump షాక్?

వాషింగ్టన్: H-1B, E, L-1, O-1, TN వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగం కోల్పోయిన వారికి కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించాలని నిర్ణయించుకుంది. అంటే.. వెంటనే కొత్త ఉద్యోగం దొరకకపోతే అమెరికా నుంచి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే గ్రేస్ పీరియడ్ కల్పించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గ్రేస్ పీరియడ్ అలాగే ఉంది. పబ్లిక్ కామెంట్ పీరియడ్ తర్వాతే ఫైనల్ రూల్ వస్తుంది. భారతీయ టెక్ ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.



