← Back to news

US-Iran వార్ ఎఫెక్ట్.. క్రూడ్ ఆయిల్ ధర పైపైకి.!

By A. Ajay· 1d ago
US-Iran వార్ ఎఫెక్ట్.. క్రూడ్ ఆయిల్ ధర పైపైకి.!

మిడిల్ ఈస్ట్‌లో US-Iran ఉద్రిక్తతలతో అంతర్జాతీయ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కి 100 డాలర్లను దాటేసింది. ఇరాన్‌కు చెందిన IRGC.. అమెరికా యుద్ధ నౌకపై క్షిపణులతో దాడికి ప్రయత్నించినట్లు US తెలిపింది. దీనికి ప్రతిగా అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన 5 చమురు ట్యాంకర్లను గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఖర్గ్ ద్వీపం దగ్గర్లో ధ్వంసం చేశాయి. ఆ తర్వాత ఇరాన్‌.. హార్ముజ్ జలసంధి పరిధిలోని కొన్ని ప్రాంతాలను Restricted Zoneగా ప్రకటించి, అటు వచ్చే నౌకలను హెచ్చరించింది. దీంతో కీలక ఆయిల్‌ రవాణా మార్గమైన హార్ముజ్‌లో ఆందోళనలు పెరిగాయి.

More in International