← Back to news

రోడ్డుపై పడిన భారీ చెట్టు

By DK· 2h ago
రోడ్డుపై పడిన భారీ చెట్టు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాక మఠం–చాకలిపాలెం ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులపై వెళ్లేవారు, బైక్‌లపై ప్రయాణించే వారు అవస్థలు పడుతున్నారని స్థానికులు తెలిపారు. రహదారిపై చెట్టు కూలి రాకపోకలు నిలిచిపోయినా అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More in Local