← Back to news

సంతకవిటిలో ముంపు ప్రాంతాల పరిశీలన

By Mahesh· 2h ago· Vizianagaram
సంతకవిటిలో ముంపు ప్రాంతాల పరిశీలన

సంతకవిటి మండలంలోని కొండగూడెం, జావాం, రామచంద్రపురం, రంగరాయపురం ముంపు ప్రాంతాలను MPTC వల్లూరు గణేష్ పరిశీలించారు. వర్షాలకు నీటమునిగిన పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి పంట నష్టాన్ని నమోదు చేయిస్తామని, రైతులకు పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

More in Local