నిరక్షరాస్య మహిళలకు ప్రత్యేక పరీక్షలు

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం జలాల్‌పూర్‌లో స్వయం సహాయక సంఘాల నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ పథకం కింద ప్రత్యేక పరీక్ష నిర్వహించారు. ‘అమ్మకు అక్షరమాల’ లక్ష్యంతో 18 ఏళ్లు పైబడిన మహిళలకు చదవడం, రాయడం, ప్రాథమిక గణితంపై శిక్షణ ఇస్తున్నారు. ఆదివారం పంచాయతీలో SHG అధ్యక్షురాలు, IKP VOA మేడికుంది మల్లేశం ఆధ్వర్యంలో పరీక్ష జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.



