3 ఏళ్లుగా పట్టించుకోని అధికారులు

శ్రీ సత్యసాయి జిల్లా 4వ వార్డు పుల్లేరు రోడ్డు సమస్యపై మూడేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పిన ఎవరూ పట్టించుకోవడం లేదు. చిన్న వర్షం పడినా రోడ్డు చెరువులా మారి బైక్‌లు, నడిచేవాళ్లు వెళ్లడం నరకంగా మారింది. ఇప్పటికే ముగ్గురు కిందపడి దెబ్బలు తగిలాయి. ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.





