← Back to news

NFCలో 538 పోస్టులు.. రేపే లాస్ట్ డేట్!

By Mahesh· 2h ago· Gov
NFCలో 538 పోస్టులు.. రేపే లాస్ట్ డేట్!

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ <a href="https://www.nfc.gov.in/recruitment.html">(NFC)</a> హైదరాబాద్‌లో 2026–27 అప్రెంటిస్‌షిప్‌కు 538 పోస్టులున్నాయి. ఇందులో 432 ఐటీఐకు, 106 డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ పోస్టులున్నాయి. 10th + ఐటీఐ, డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్నవారు అప్లై చేయొచ్చు. ఏజ్ మినిమమ్ 18 ఏళ్లు, మ్యాక్సిమమ్ జనరల్‌కు 25, OBCకు 28, SC/STకు 30 ఏళ్లు ఉండాలి. రేపటితో (సెప్టెంబర్ 16) అప్లికేషన్స్ ముగుస్తాయి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ITI వారు <a href="https://www.apprenticeshipindia.gov.in/candidate-login">NAPS,</a> డిప్లొమా/గ్రాడ్యుయేట్ వారు <a href="https://nats.education.gov.in/student_register.php">NATS</a> ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.

More in Jobs