బతికుండగానే చచ్చి.. చచ్చిన వ్యక్తిగా బతికొచ్చాడు

సినిమాను గుర్తుకుతెచ్చే ఒక ఘటన చైనాలో జరిగింది. 2002లో జెజియాంగ్ ప్రావిన్స్లో ఒక కిడ్నాప్, దోపిడీ కేసులో నిందితుడు దొరక్కుండా పారిపోయాడు. పోలీసులు ఆ కేసు మూసేశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితుడు ‘చెన్’ మాస్టర్ ప్లాన్ వేశాడు. తను చనిపోయినట్లు నమ్మించి, చనిపోయిన తన కవల సోదరుడి గుర్తింపును తను వాడుకోవడం మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యులు కూడా అతనికి సహకరించారు. ఆ కవల సోదరుడి మాజీ ప్రియురాలు నిజం కనిపెట్టడంతో ఇన్నేళ్ల తర్వాత విషయం బయటపడింది.



