జపాన్లో 9.9 తీవ్రతతో భూకంప హెచ్చరిక.. అంతా ప్రశాంతం

జపాన్ వాతావరణ సంస్థ (JMA) ఇవాళ మధ్యాహ్నం దేశవ్యాప్తంగా అత్యంత అత్యవసర భూకంప ముందస్తు హెచ్చరికను జారీ చేసింది. చరిత్రలోనే అత్యంత తీవ్రమైన 9.9 రిక్టర్ స్కేలు తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉందని, ప్రజలందరూ వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఈ అలర్ట్ ద్వారా హెచ్చరించారు. అయితే, హెచ్చరిక వచ్చినా ఎలాంటి భూప్రకంపనలు నమోదు కాకపోవడంతో ప్రజలు అయోమయానికి, ఆందోళనకు గురయ్యారు. చివరకు సిస్టమ్ అంచనా తప్పని గుర్తించిన అధికారులు ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు.



