అండర్ పాస్‌లో నీరు.. ఇబ్బందుల్లో ప్రజలు!

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం బొడ్డేపల్లి అండర్‌పాస్‌లో వర్షపు నీరు నిలవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆమదాలవలస మండలం లొద్దలపేటకు చెందిన కాంతారావు అనారోగ్యంతో ఉండటంతో, నీటితో నిండిన అండర్‌పాస్‌ను దాటేందుకు కుటుంబ సభ్యులు ఆయనను మంచంపై మోసుకెళ్లారు. ఈ మార్గం ద్వారా సుమారు 10 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారీ అండర్‌పాస్‌లో నీరు నిలిచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు.



