సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు భారీ దసరా బోనస్ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు ప్రకటించారు. సంస్థ లాభాల్లో 34% కార్మికులకు పంపిణీ చేయనున్నారు. పర్మినెంట్ ఉద్యోగులకు ₹1,53,903, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ₹5,500 బోనస్ ఇవ్వనున్నారు. పెండింగ్ డిపెండెంట్ జాబ్ అప్లికేషన్స్ 15 రోజుల్లో పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక కార్మికులకు మెడికల్ టెస్టులు ఏరియా హాస్పిటల్లోనే నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.



