గవర్నమెంట్ స్కూల్స్ రియాలిటీ చూడండి
నోయిడాలోని ఒక గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ పరిస్థితిపై CJP స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ 'X' లో షేర్ చేశారు. అత్యంత సంపన్న నగరమైన నోయిడాలోని స్కూల్లో పాడైపోయిన టాయిలెట్లు, పగిలిన డోర్లు, మురికి గోడలను చూపుతూ.. పొలిటీషియన్స్ హిందూ-ముస్లిం రాజకీయం ఆపి, స్కూల్స్ బాగుచేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నోయిడా గవర్నమెంట్ స్కూల్లో సరిపడా రూమ్స్ లేకపోవడం, బాత్‌రూమ్స్ క్లీన్‌గా లేకపోవడంపై న్యూస్ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ పోస్ట్‌పై అధికారుల రెస్పాన్స్ రావాల్సి ఉంది.



