వృద్ధాప్యం అంటే జీవిత అనుభవం

వేంసూరు మండలం కందుకూరులో సుధా హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ 40 మంది వృద్ధులకు చీరలు పంచింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్, ఆయుర్వేద డాక్టర్ కొనకళ్ల సుధారాణి మాట్లాడుతూ, వృద్ధాప్యం అంటే కేవలం వయసు పెరగడం కాదు, జీవిత అనుభవానికి గుర్తు అని చెప్పారు. పెద్దవాళ్లను నిర్లక్ష్యం చేయకుండా ఇంట్లో ప్రేమగా, గౌరవంగా చూసుకోవాలని కోరారు.


