పెంచికలపాడుకు రెగ్యులర్ AEOను నియమించాలి

TG: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు గ్రామానికి రెగ్యులర్ వ్యవసాయ విస్తరణ అధికారి (AEO)ను వెంటనే కేటాయించాలని గ్రామ సర్పంచ్ కుర్వ ఆంజనేయులు, PDSU జిల్లా అధ్యక్షుడు హాలింపాష డిమాండ్ చేశారు. గట్టు మండలంలో 11 క్లస్టర్లకు గతంలో 11 మంది AEOలు పనిచేయగా, ప్రస్తుతం 9 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. దీంతో రైతులకు పంట నమోదు, వ్యవసాయ సేవలు, యూరియా, ఇతర ఎరువుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.



