MLC బల్మూర్ వెంకట్‌పై భూకబ్జా ఆరోపణలు.. CPM విమర్శలు
TG: మేడ్చల్ జిల్లా బౌరంపేట్‌లో MLC బల్మూర్ వెంకట్‌పై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 259/Pలో వృద్ధాశ్రమం నిర్మాణం కోసం పీపుల్స్ ప్రోగ్రెసివ్ ట్రస్ట్ 3.35 ఎకరాల భూమిని కొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ భూమిని ఫేక్ డాక్యుమెంట్లతో బల్మూర్ వెంకట్ కబ్జా చేశారని CPM ఆరోపించింది. భూమి బాధితులకు మద్దతుగా వచ్చిన CPM నాయకులపై బీర్ సీసాలు, రాళ్లతో దాడి చేయించారని కూడా విమర్శించింది. ఈ ఆరోపణలపై బల్మూర్ వెంకట్ స్పందన తెలియాల్సి ఉంది.



