← Back to news

నందిపేట్‌లో పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు

By naveed mohd· 2h ago· izamabad
నందిపేట్‌లో పంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు

నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం సిబ్బందికి దుస్తులు, నిత్యావసర వస్తువులు, చెప్పులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రం లింగం, ఉపసర్పంచ్ రామ్ చందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో చెత్త పేరుకుపోకుండా చూడాలని, ప్రతి వార్డులో పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి చెప్పారు. తాగునీరు వృథా కాకుండా చూడాలని, గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు.

More in Local