రష్యాలో తెలంగాణ యువకులకు షాక్

రష్యాలో జాబ్స్ కోసం వెళ్లిన ముగ్గురు తెలంగాణ యువకులు ఇప్పుడు ఇండియా రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిరుషు అశోక్, మెగావత్ ప్రకాశ్, మహ్మద్ అఫ్జల్ ఖాన్ రష్యా సిటిజెన్‌షిప్ ఉన్నట్లు డాక్యుమెంట్స్ వెల్లడిస్తున్నాయి. వీరిలో ప్రకాశ్, అఫ్జల్ రష్యా రక్షణ శాఖలో జాబ్ పేరుతో ఏడాది సైనిక ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. దీంతో భారత్ వారిని తిరిగి తీసుకురావడానికి దౌత్యపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే, తాము సంతకం చేసిన డాక్యుమెంట్స్ పూర్తి డీటైల్స్ యువకులకు తెలియదని వారి కుటుంబాలు చెబుతున్నాయి.



