రెండువేల మంది భక్తులకు అన్నప్రసాదం
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 2 వేల మంది భక్తులు, గ్రామస్తులకు అన్నప్రసాదం అందించారు. గుంటూరు జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు.


