సైకిల్ పైకి లారీ... కాలు నుజ్జు!

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం టానా సెంటర్ దగ్గర బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం. వినాయక విగ్రహాల ఊరేగింపుతో ట్రాఫిక్ జామ్. సైకిల్ పై వెళ్తున్న గున్నిపల్లి అన్నవరం (60) ను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. లారీ చక్రం కాలుపై నుంచి వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జు. 108 సిబ్బంది గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


