మతసామరస్యానికి ప్రతీక.. మార్కెట్ చైర్మన్!

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం మలక్ చించోలి గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. దుర్గామాత మండపం వద్ద ఆయన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, నాయకులు దాసరి రమేష్, నర్సయ్య, దాసరి మల్లేష్, సత్యం, ముత్యం, గ్రామస్తులు పాల్గొన్నారు.



