← Back to news

తుఫాన్ ప్రభావిత రైతులకు పరిహారం ఇవ్వాలి: తలే రాజేష్

By Mohan· 1d ago· Regidi, Regidi Amadalavalasa, Vizianagaram
తుఫాన్ ప్రభావిత రైతులకు పరిహారం ఇవ్వాలి: తలే రాజేష్

రైతులు, బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకుని నష్టపరిహారం అందించాలని రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్ డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలంలోని కోమేర, గదవపేట, వెంకంపేట గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, ఆస్తి నష్టాలను ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి పంటలు, ఆస్తులకు జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కష్టకాలంలో రైతులు, బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

More in Local