చిన్నారుల చూపుపై నిర్లక్ష్యం వద్దు

ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.9 కోట్ల మంది చిన్నారులు చూపు సమస్యలతో బాధపడుతున్నారని 'World Health Organization' అంచనా వేసింది. వీరిలో 14 లక్షల మంది పూర్తిగా చూపు కోల్పోయారు. భారత్‌లోనూ సుమారు 3 లక్షల మంది చిన్నారులు అంధత్వంతో బాధపడుతున్నట్లు ఈ నివేదికలో తెలిపారు. చిన్నతనంలోనే కంటి సమస్యలను గుర్తిస్తే చాలా వరకు చికిత్సతో నివారించవచ్చు. అందుకే టీకాలు, సాధారణ ఆరోగ్య పరీక్షల సమయంలోనూ పిల్లల కళ్లను పరీక్షించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.



