← Back to news

కల్లడిలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

By Rodda Vamshi Krishna· 1d ago· Kalladi, Aloor, Nizamabad
కల్లడిలో చాకలి ఐలమ్మకు ఘన నివాళులు

కల్లడి గ్రామంలో చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహానికి గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కల్లడి గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇస్సపల్లి రాజు మాట్లాడుతూ.. భూమి, భుక్తి, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. భూస్వామ్య దోపిడీ, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర పోషించారని తెలిపారు.

More in Local