డప్పు ఎల్లమ్మ సేవలు మరువలేం : సర్పంచ్

గ్రామంలో డప్పు చాటింపుతో వార్తలు చేరవేసిన డప్పు ఎల్లమ్మ మృతి చెందడంతో మైల్వార్ సర్పంచ్ సీమా సుల్తానా కుటుంబానికి సహాయం అందించారు. ఎల్లమ్మ కొడుకుని, కుటుంబాన్ని పరామర్శించి, ఎల్లమ్మ ఫోటోకి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి 5,000 రూపాయిల ఆర్థిక సాయం అందించారు. ఎల్లమ్మ ఊరికి చేసిన సేవలు చిరస్మరణీయమని సర్పంచ్ కొనియాడారు.



