BRS నాయకుడి కుటుంబానికి మంత్రి అడ్లూరి హెల్ప్

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకుంటకు చెందిన BRS మాజీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. రాజకీయాలకు అతీతంగా స్పందించిన మంత్రి, కుటుంబానికి 50 వేల రూపాయిలు అందించారు. అంతేకాకుండా అవుట్‌సోర్సింగ్ జాబ్ ఇప్పిస్తామని, పిల్లల చదువుకి ఫుల్ సపోర్ట్ ఉంటామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు థాంక్స్ చెప్పారు.