← Back to news

నీటి వృథాకు చెక్ పెట్టండి.. 20% తగ్గించండి

By Prashanth· 12h ago
నీటి వృథాకు చెక్ పెట్టండి.. 20% తగ్గించండి

TG: హైదరాబాద్‌ నగరంలో తాగునీటి కొరత రాకుండా ప్రజలు రోజూ వాడే నీటిలో కనీసం 20% ఆదా చేయాలని చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు కోరారు. ఇలా చేస్తే రోజుకు 80 మిలియన్​ గ్యాలన్ల నీటిని ఆదా చేయవచ్చని తెలిపారు. జలమండలి నీటితో కార్లు, బైకులు కడగొద్దని, రోడ్లపై నీటిని వృథా చేయొద్దని సూచించారు. నీటి పొదుపుపై నగరంలో 60 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరోవైపు, హైదరాబాద్‌కు అదనంగా 60 మిలియన్​ గ్యాలన్ల నీటిని అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

More in TG