కనిగిరిలో నామినేషన్లపై దౌర్జన్యం!
మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలో 32 వార్డుల ఎన్నికల నామినేషన్లపై వివాదం చెలరేగింది. YCP అభ్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులను తప్పించి TDPకి చెందిన 150-200 మంది బయటి వ్యక్తులు నామినేషన్ కేంద్రంలోకి చొరబడి పత్రాలు చించారని, దాడులకు పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై SP, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని, రీనోటిఫికేషన్ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.



