మండల అధ్యక్షుడిగా గుగులోతు రాజు నాయక్

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట BRS మండల అధ్యక్షుడిగా తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు గుగులోతు రాజు నాయక్ అపాయింట్ అయ్యారు. గత 20 ఏళ్లుగా ప్రజా సమస్యల పైన పోరాడుతూ, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న ఆయన సర్వీసెస్‌ని గుర్తించి పార్టీ ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. గిరిజన లీడర్‌కి మండల స్థాయి బాధ్యతలు ఇవ్వడంపై గిరిజన సంఘాలు, పార్టీ కేడర్ హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్‌కి థ్యాంక్స్ చెప్పారు.



