కొణిజర్లలో రోడ్డు ప్రమాదం

కొణిజర్ల మండలం పల్లిపాడు స్వర్ణభారతి కోల్డ్ స్టోరేజ్ దగ్గర రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. స్పీడ్ గా వచ్చిన ఒక లారీ వెనుక నుంచి బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో మాడపాటి నరసింహారావు అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని వైరాకు చెందిన కూరగాయల వ్యాపారిగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకుని ఎంక్వైరీ చేస్తున్నారు.




