రద్దీగా ఖైరతాబాద్.. బడా గణేష్ దర్శనానికి భారీగా భక్తులు

ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం ఇవాళ అర్ధరాత్రి వరకే, రేపు నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభమై 25న ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనం జరుగుతుంది. ఈ కారణంగా చివరి రోజు దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ఇన్ని రోజులూ.. లక్షల మంది గణేషుణ్ని దర్శించుకున్నారు. ఈ సంవత్సరం నిమజ్జన కార్యక్రమం త్వరగా పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. 25న మధ్యాహ్నం 1 గంట లోపు నిమజ్జనం పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ తగిన ఏర్పాట్లు చేశారు.


