విద్యాభివృద్ధికి మరింత కృషి చేయాలి

TG: రాష్ట్ర ఉత్తమ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా అవార్డు అందుకున్న ఎం.డి. సలీం షరీఫ్‌ను సూర్యాపేట జిల్లా కోదాడలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్. భిక్షం మాట్లాడుతూ అవార్డులు బాధ్యతలను మరింత పెంచుతాయని, కోదాడ మండల విద్యాభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరారు. భవిష్యత్‌లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కైలాసం వెంకటేశ్వర్లు, బడుగుల సైదులు, తదితరులు పాల్గొన్నారు.