← Back to news

‘రాజధాని లేకపోతే ఏమీ చేయలేం’.. చంద్రబాబు కీలక కామెంట్స్

By Mahesh· 13 Aug 2026· అమరావతి
‘రాజధాని లేకపోతే ఏమీ చేయలేం’.. చంద్రబాబు కీలక కామెంట్స్

AP: సింగపూర్‌ మోడల్‌తో అమరావతిని కడుతున్నామని CM చంద్రబాబు నాయుడు అన్నారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతో అమరావతికి కనెక్టివిటీ మరింత పెరుగుతుందని తెలిపారు. ఈరోజు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు సెకండ్ ఫేజ్‌తో పాటు బకింగ్‌హామ్‌ కెనాల్‌పై నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని సీఎం స్టార్ట్ చేశారు. సీఎం మాట్లాడుతూ.. రాజధాని లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని, రైతుల త్యాగాల వల్లే రాజధాని నిర్మాణం సాధ్యమైందని అన్నారు.

More in Politics