మదనపల్లెలో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రోడ్డు భద్రతపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అన్నమయ్య సర్కిల్‌లో ట్రాఫిక్ CI చాంద్ బాషా ఆధ్వర్యంలో వాహనదారులకు పలు సూచనలు చేశారు. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మైనర్లు డ్రైవింగ్ చేయకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. వాహనం నడుపుతున్నప్పుడు ఫోన్ ఉపయోగించరాదని, డ్రైవింగ్ లైసెన్స్ వెంట ఉంచుకోవాలని చెప్పారు. వాహనదారులు నిబంధనలను పాటించి సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.



