నేడు గరుడ సేవ, సర్వం సిద్ధం

నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి తిరుమల మాడ వీధుల్లో మలయప్ప స్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాధారణ వార్షిక బ్రహ్మోత్సవాల కంటే 30 శాతం అధికంగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేసింది. ఉదయం 7 నుంచి అర్ధరాత్రి వరకు అన్నప్రసాదం అందిస్తారు. ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలపై నిషేధం ఉంది. భక్తుల కోసం 3,100 ఆర్టీసీ ట్రిప్పులు నడుపుతున్నారు.



