పులివెందులలో నామినేషన్లు స్టార్ట్

కడప జిల్లా పులివెందుల మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు శుక్రవారం స్టార్ట్ అయ్యాయి. తొలిరోజు వైసీపీ అభ్యర్థులు ఫైల్ చేశారు. చైర్పర్సన్ ఒకరు, 28 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, స్వతంత్రులు ఇంకా ఫైల్ చేయలేదు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా డీఎస్పీ మురళి నాయక్ టీమ్ పటిష్ట బందోబస్తు చేసింది.



