అరకు కాలేజీలో ప్లాంటేషన్ డ్రైవ్

అరకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ బొటనీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ‘వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే’ సందర్భంగా మొక్కలు నాటారు. ప్రిన్సిపల్ కేశవరావు మాట్లాడుతూ, హెల్దీ లైఫ్ కోసం స్వచ్ఛమైన గాలి, నీరు, పచ్చదనం చాలా ముఖ్యమని, మొక్కలు నాటి వాటిని కాపాడటం అందరి రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. బొటనీ టీచర్ లచ్చన్న పర్యావరణం ప్రాముఖ్యతను వివరించారు. టీచర్లు, స్టూడెంట్స్ పాల్గొని మొక్కలు నాటారు.



